జూమ్‌ తరహాలో దేశీయ యాప్ వస్తోంది…

చైనా మేడ్ జూమ్‌ని ఢీకొట్టేందుకు టెక్ కంపెనీలను రంగంలోకి దించింది కేంద్రం. జూమ్ యాప్‌కు ధీటుగా దేశీయ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను రూపొందించేందుకు రెడీ అవుతోంది.

జూమ్‌ తరహాలో దేశీయ యాప్ వస్తోంది...
Follow us

|

Updated on: May 26, 2020 | 5:10 PM

చైనా మేడ్ జూమ్‌ని ఢీకొట్టేందుకు టెక్ కంపెనీలను రంగంలోకి దించింది కేంద్రం. జూమ్ యాప్‌కు ధీటుగా దేశీయ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను రూపొందించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే టెక్ కంపెనీలకు సవాల్ విసిరిన కేంద్ర సమాచార, పౌర సంబంధాల శాఖ.. తొలి రౌండ్‌లో భాగంగా పది కంపెనీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో జోహో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పీపుల్‌లింక్, డేటా ఇంజీనియస్ సహా పలు కంపెనీలు ఇందులో ఉన్నాయి. జూమ్, గూగుల్ హ్యాంగౌట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ తరహాలో తమ ప్రొడక్ట్ తాలూకు నమూనాలను ఈ కంపెనీలు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. నమూనా తయారీ కోసం ఈ సంస్థలకు కేంద్రం రూ. 5 లక్షల చొప్పున చెల్లించనుంది. తర్వాత మూడో దశలో అత్యుత్తమ ప్రాజెక్టును ఎంపిక చేసి జూమ్‌ తరహా వేదికలకు ప్రత్యామ్నాయంగా ఓ వీడియో కాన్ఫరెన్సింగ్ లింక్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులోకి తీసుకొస్తారు.