AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా వైరస్.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే’.. చైనా ‘గబ్బిల మహిళ’ వార్నింగ్

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కేవలం ‘సముద్రంలో రెట్ట’ వంటిదేనని బాంబు పేల్చింది చైనా వైరాలజీ సంస్థ రీసెర్చర్ షీ జెంగ్లీ. ‘ఒక విధంగా ఇది శాంపిల్ మాత్రమే ! ఇంకా చాలా వైరస్ లు ఉన్నాయి’ అని ఆమె ప్రకటించింది. గబ్బిలాలలోని వివిధ వైరస్ల మీద పరిశోధనలు చేస్తున్న ఈమెను ‘చైనీస్ బ్యాట్ వుమన్’ (చైనా గబ్బిల మహిళ) అని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం తాను, తన టీమ్ సభ్యులు కనుగొంటున్న వైరస్ లు […]

'కరోనా వైరస్.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే'.. చైనా 'గబ్బిల మహిళ' వార్నింగ్
Umakanth Rao
| Edited By: |

Updated on: May 26, 2020 | 6:12 PM

Share

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కేవలం ‘సముద్రంలో రెట్ట’ వంటిదేనని బాంబు పేల్చింది చైనా వైరాలజీ సంస్థ రీసెర్చర్ షీ జెంగ్లీ. ‘ఒక విధంగా ఇది శాంపిల్ మాత్రమే ! ఇంకా చాలా వైరస్ లు ఉన్నాయి’ అని ఆమె ప్రకటించింది. గబ్బిలాలలోని వివిధ వైరస్ల మీద పరిశోధనలు చేస్తున్న ఈమెను ‘చైనీస్ బ్యాట్ వుమన్’ (చైనా గబ్బిల మహిళ) అని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం తాను, తన టీమ్ సభ్యులు కనుగొంటున్న వైరస్ లు చాలా స్వల్పమని చైనీస్ స్టేట్ టెలివిజన్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఈమె పేర్కొంది. ఈ విధమైన వైరస్ ల పై జరిపే పోరులో అంతర్జాతీయ సహకారం ఎంతైనా అవసరమని ఆమె వ్యాఖ్యానించింది. ఈమె వూహాన్ లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కూడా. వివిధ రకాల వైరస్ లపై జరిపే పరిశోధనల్లో శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల పారదర్శకత, సహకారం, సమన్వయం కూడా అవసరం.. సైన్స్ ని రాజకీయం చేస్తున్నారు’ అని షీ జెంగ్లీ కాస్త విచారం వ్యక్తం చేసింది.

రాబోయే రోజుల్లో పుట్టుకొచ్చే వైరస్ ల బారి నుంచి మనుషులను రక్షించాలంటే ప్రకృతిలోని వన్యమృగాల నుంచి బయల్పడే మిస్టీరియస్ వైరస్ ల గురించి ముందే తెలుసుకుని అధ్యయనం చేయాలనీ, ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని ఈ ‘గబ్బిల మహిళ’ సూచించింది. వాటిని మనం అధ్యయనం చేయకపోతే మరో ‘ఔట్ బ్రేక్’ తప్పదని ఆమె మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. తాను పరిశోధించిన వైరస్ ల జన్యుక్రమాలు ప్రస్తుతం మనుషులకు సోకుతున్న వైరస్ తో మ్యాచ్ కాలేదని షీ జెంగ్లీ స్పష్టం చేసింది. తమ ల్యాబ్ కి, ఈ కరోనా వైరస్ కి సంబంధం లేదని ప్రమాణం చేసి చెబుతున్నానని ఈమె తన ట్విటర్ లో పేర్కొంది. ఈ వైరస్ తమ ల్యాబ్ నుంచి జనించిందన్న వ్యాఖ్యలు వట్టి కట్టుకథలని ఈ ల్యాబ్ డైరెక్టర్ వాంగ్ యానీ కూడా నిన్న స్పష్టం చేసింది.

కాగా-బీజింగ్ లో  నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం జరగనున్న తరుణంలో షీ జెంగ్లీ ఇఛ్చిన ఇంటర్వ్యూ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో చైనా సంబంధాలు బలహీనపడుతున్న సమయంలో ఈ సమావేశ అజెండా కూడా అదే కావచ్ఛు ! వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి మైఖేల్ పాంపియో కూడా పదేపదే ఆరోపిస్తుండగా.. చైనా కూడా అదే పనిగా ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..