AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ముళ్ల పొదల్లో మద్యం డంప్

రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో భారీ మద్యం డంప్ కనిపించడంతో ఏపీ పోలీసులు అవాక్కయ్యారు. మంగళవారం మధ్యాహ్నం భారీ మద్యం డంప్‌ను ఏపీ పోలీసులు కనుగొన్నారు. దాన్ని తెలంగాణ నుంచి అక్రమంగా ఏపీకి తరలిస్తున్న ...

బ్రేకింగ్: ముళ్ల పొదల్లో మద్యం డంప్
Rajesh Sharma
|

Updated on: May 26, 2020 | 5:33 PM

Share

రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో భారీ మద్యం డంప్ కనిపించడంతో ఏపీ పోలీసులు అవాక్కయ్యారు. మంగళవారం మధ్యాహ్నం భారీ మద్యం డంప్‌ను ఏపీ పోలీసులు కనుగొన్నారు. దాన్ని తెలంగాణ నుంచి అక్రమంగా ఏపీకి తరలిస్తున్న మద్యంగా పోలీసులు గుర్తించారు. ఏపీలో లభ్యమవుతున్న మద్యం అడ్రస్ లేని బ్రాండ్లని ఆంధ్ర మందుబాబులు చెప్పుకుంటుంన్న నేపథ్యంలో ఈ మద్యం డంప్ లభ్యమవడం విశేషం.

లాక్ డౌన్ ఒకవైపు.. ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచడంతోపాటు అడ్రస్ లేని బ్రాండ్లను విక్రయానికి రెడీ చేయడంతో తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు- చినగార్లపాడు గ్రామాల మధ్య ముళ్లపొదల్లో తెలంగాణ నుండి మద్యం అక్రమంగా తీసుకువచ్చి నిల్వవుంచిన 1600 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు దాచేపల్లి పోలీసులు. వీటి విలువ ఐదు లక్షల రూపాయలుంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో సరైన బ్రాండ్లు దొరక్కపోవడంతో వారు తెలంగాణ మద్యం వైపు చూస్తున్నారని, అందుకే కొందరు బరితెగించి తెలంగాణ మద్యాన్ని ఏపీకి స్మగుల్ చేస్తున్నారని చెబుతున్నారు.

Follow Us
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ క్రాష్.. ఇప్పుడు ఎంతంటే
కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ క్రాష్.. ఇప్పుడు ఎంతంటే