Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

మరో 30 రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. ఈ సందర్భంగా ఆయన వైరస్‌కి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో ఆయన మాట్లాడుతూ.. ఐదు నుంచి పది రెట్లు పాజిటివ్ కేసులు పెరిగే...
Corona cases to increase tenfold over next 30 days says CCMB Director, మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

మరో 30 రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. ఈ సందర్భంగా ఆయన వైరస్‌కి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఐదు నుంచి పది రెట్లు పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదముందన్నారు. ఎండాకాలం ఉష్ణోగ్రతలు పెరిగినంత మాత్రాన వైరస్ వ్యాప్తి ఆగదన్నారు. ప్రకటిస్తున్న వాక్సిన్‌లు అన్నీ ఇంకా క్లినికల్ ట్రయల్స్‌లోనే ఉన్నాయి. వ్యాక్సిన్ రావడానికి కనీసం ఆరు నెలలకు పైగా సమయం ఖచ్చితంగా పడుతుందన్నారు.

కరోనా వైరస్ మ్యుటేషన్ నేపథ్యంలో వాక్సిన్ పనితీరుపై కూడా ప్రభావం ఉంటుంది. వ్యాక్సిన్ ప్రభావం కొన్నింటి మీద పని చేసినా.. మరికొన్నింటి మీద పని చేయకపోవచ్చు. వాక్సిన్ గురించి ఆలోచించే కన్నా మన జాగ్రత్తలే మనకు తక్షణ మార్గమన్నారు. ప్రాంతాల బట్టి కరోనా రూపాంతరం చెందుతోంది. అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్‌లో మార్పులను గమనిస్తున్నాం. తెలంగాణ, గుజరాత్, ఢిల్లీతో సహా పలు ప్రదేశాల్లో అసాధారణ కరోనాను గమనిస్తున్నాం. తెలంగాణలో కనిపిస్తున్న వైరస్.. మిగిలిన ప్రాంతాల వైరస్‌లకు భిన్నంగా ఉంది. ఈ కరోనా వైరస్‌పై మరిన్ని లోతైన పరిశోధనలు సాగుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.

Read More: 

వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు

‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..

Related Tags