జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన హిమాచల్ ప్రదేశ్
కరోనా వైరస్ కట్టడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తిసాములా మారింది. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పొగిడించనుంది. హిమాచల్‌లో ప్రస్తుతం 214 వైరస్ కేసులు నమోదవగా వీరిలో 63 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి ఐదుగురు మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాలు […]

కరోనా వైరస్ కట్టడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తిసాములా మారింది. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పొగిడించనుంది. హిమాచల్‌లో ప్రస్తుతం 214 వైరస్ కేసులు నమోదవగా వీరిలో 63 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి ఐదుగురు మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం, కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించిన క్రమంలో హిమాచల్‌ప్రదేశ్ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను నాలుగు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. తాజా లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది. అత్యధిక కేసులతో తల్లిడిల్లుతున్న మహారాష్ట్ర మాత్రమే ఇప్పటివరకూ లాక్‌డౌన్ పొడిగింపును కోరుతోంది. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాలు మాత్రం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వాలని కోరుతున్నాయి.