అసోంలో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రహదారులు.. స్తంభించిన రాకపోకలు..

ఎంఫన్ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య భారతం విలవిలలాడుతోంది. జోరుగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసోంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి సోమవారం గోల్పారా జిల్లాలోని అగియా-లఖీంపూర్‌ జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. దాదాపు వంద మీటర్ల మేర 12వ నెంబర్‌ జాతీయ రహదారి కొట్టుకు […]

అసోంలో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రహదారులు.. స్తంభించిన రాకపోకలు..
Follow us

|

Updated on: May 25, 2020 | 6:27 PM

ఎంఫన్ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య భారతం విలవిలలాడుతోంది. జోరుగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసోంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి సోమవారం గోల్పారా జిల్లాలోని అగియా-లఖీంపూర్‌ జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. దాదాపు వంద మీటర్ల మేర 12వ నెంబర్‌ జాతీయ రహదారి కొట్టుకు పోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. నదీ పరివాహక ప్రాంతంలోని పంటలు, ఆవాసాలు మొత్తం నీట మునిగాయి. దీంతో వందలాది మంది జనం నిరాశ్రయులయ్యారు. వరదలవల్ల అసోం రాష్ట్రంలోని చెరువులు, కుంటల కట్టలు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో చిన్నచిన్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!