Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ కీలక వ్యాఖ్యలు.. నాకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలి..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా 'మన పాలన - మీ సూచన' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం నేటి నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.

జగన్ కీలక వ్యాఖ్యలు.. నాకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2020 | 6:00 PM

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం నేటి నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు.. పాలన వ్యవస్థలో వికేంద్రీకరణ, సచివాలయాల వ్యవస్థపై చర్చించారు. అలాగే వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారితో ఇష్టా గోష్టితో పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రజల సూచనలు, సలహాలను స్వీకరించారు. మొదటి రోజు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వెల్లడించారు. అలాగే లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో సీఎం జగన్ కీలక పాయింట్స్:

– దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు – ప్రభుత్వ సేవలను నేరుగా లబ్ధిదారుని ఇంటికే తీసుకెళ్లాం – ఒక్కో ఊళ్లో 12 ఉద్యోగాలు ఇచ్చాం – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 82.5 శాతం ఉద్యోగాలు ఇచ్చాం – గ్రామ వాలంటీర్లు బాగా పని చేస్తున్నారు – 2.60 లక్షల మందికి వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చాం – మనబడి, నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి – 21.11.2019న మత్య్సకార భరోసాకు శ్రీకాంర చుట్టాం – మే 18 వరకు ఆరోగ్య శ్రీ కింద పూర్తిగా బకాయిలు చెల్లించేశాం – 12.12.2019న దిశ చట్టం తీసుకొచ్చాం – 21.12.2019న వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం – కులం, మతం, పార్టీ తేడాల్లేకుండా పని చేస్తున్నాం – నాకు ఓటు వేయని వారికి కూడా ఈ పథకాలు అందాలి – 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం – పంటలకు మద్దతు ధర లభించేలా ‘జనతా బజార్’ ఏర్పాటు – రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నాం – పెన్షన్‌ని రూ.2,250లు ఇస్తున్నాం – స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం – 21.02.2020న జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం – మేనిఫెస్టోలో పొందిపరిచినవి ఖచ్చితంగా అందిస్తాం