AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగపూర్.. ఈద్ వేళ.. 600 మంది వలస కార్మికులకు బిర్యానీ విందు

సింగపూర్ లో సుమారు ఆరువందల మంది వలస కార్మికులకు ఆదివారం  నిజంగా ఈద్ పండుగ.. పండుగే అయింది. ఈద్ ఉల్-ఫితర్ సందర్భంగా దుష్యంత్ కుమార్ అనే బిజినెస్ మన్ తన భార్యతోను, మరికొంతమంది కుక్ లతోను కలిసి బ్రహ్మాండమైన బిర్యానీ విందు..

సింగపూర్.. ఈద్ వేళ.. 600 మంది వలస కార్మికులకు బిర్యానీ విందు
Umakanth Rao
| Edited By: |

Updated on: May 25, 2020 | 12:26 PM

Share

సింగపూర్ లో సుమారు ఆరువందల మంది వలస కార్మికులకు ఆదివారం  నిజంగా ఈద్ పండుగ.. పండుగే అయింది. ఈద్ ఉల్-ఫితర్ సందర్భంగా దుష్యంత్ కుమార్ అనే బిజినెస్ మన్ తన భార్యతోను, మరికొంతమంది కుక్ లతోను కలిసి బ్రహ్మాండమైన బిర్యానీ విందు ఏర్పాటు చేశాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ వలస కార్మికులంతా తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. పండుగ వేళ ఎలాంటి విందులకూ నోచుకోలేక ఉసూరుమంటున్నారు. దీంతో వీరి ముఖాల్లో కనీసం ఒక్క రోజయినా చిరునవ్వు చూడాలని ఈ విందు ఏర్పాటు చేసినట్టు ఆ బిజినెస్ మన్ చెబుతున్నాడు. అసలు ఏప్రిల్ నెల నుంచే ఈయన రోజుకు సుమారు వెయ్యి పాకెట్ల ఆహారాన్ని వీరికి ఇస్తూ వచ్చాడట. ఈ దేశంలో దాదాపు మూడు లక్షలమంది విదేశీ కార్మికులు  ఉన్నారు. వీరిలో చాలామంది ఇండియా, చైనా, బంగ్లాదేశ్ లకు చెందినవారు. వీరిలో అనేకమందికి   ఇళ్ళంటూ లేవు. ప్రభుత్వేతర సంస్థలు ఏర్పాటు చేసిన చిన్నపాటి గదుల్లో ఉంటున్నారు. ఒక్కో గదిలో ఇరవై నుంచి ఇరవై అయిదు మంది వరకు ఉంటూ కాలం గడుపుతున్నారు. కాగా ఈ దేశంలో ముఫై వేల కరోనా కేసులు నమోదై ఉన్నాయి.

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..