అమెరికాకు ఇక కీచురాళ్ళ బెడద !
అసలే కరోనా మహమ్మారితో సతమతమవుతున్న అమెరికాకు త్వరలో మరో ముప్పు ముంచుకు రాబోతోంది. 17 ఏళ్ళ తరువాత లక్షలాది కీచురాళ్ళ నుంచి ఆ దేశానికి ప్రమాదం తలెత్తనుంది. ముఖ్యంగా వర్జీనియా, నార్త్ కెరొలినా రాష్ట్రాల్లో ఇవి మెల్లగా కలుగుల నుంచి బయటపడుతున్నాయని ఎంటమాలాజిస్టులు చెబుతున్నారు. ఇవి చేసే విచిత్ర శబ్దాలు కర్ణ కఠోరంగా ఉంటాయని, వీటిని నియంత్రించడం కష్ట సాధ్యమని వారు పేర్కొన్నారు. చివరిసారి ఇవి 2003, 2014 లో అమెరికాలో కనిపించాయట. బురదలో, మట్టిలో ఉండే […]

అసలే కరోనా మహమ్మారితో సతమతమవుతున్న అమెరికాకు త్వరలో మరో ముప్పు ముంచుకు రాబోతోంది. 17 ఏళ్ళ తరువాత లక్షలాది కీచురాళ్ళ నుంచి ఆ దేశానికి ప్రమాదం తలెత్తనుంది. ముఖ్యంగా వర్జీనియా, నార్త్ కెరొలినా రాష్ట్రాల్లో ఇవి మెల్లగా కలుగుల నుంచి బయటపడుతున్నాయని ఎంటమాలాజిస్టులు చెబుతున్నారు. ఇవి చేసే విచిత్ర శబ్దాలు కర్ణ కఠోరంగా ఉంటాయని, వీటిని నియంత్రించడం కష్ట సాధ్యమని వారు పేర్కొన్నారు. చివరిసారి ఇవి 2003, 2014 లో అమెరికాలో కనిపించాయట. బురదలో, మట్టిలో ఉండే ఇవి చెట్ల వేర్ల మీద లక్షలాదిగా గుడ్లు పెడతాయని, గుడ్ల నుంచి పిల్లలు బయటికి రాగానే చనిపోతాయని ఎంటమాలజిస్టులు వెల్లడించారు. ఇండియాలో ఇప్పటికే మిడతల దండ్ల వల్ల యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కొత్త సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.