Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరంగల్ మర్డర్ మిస్టరీలో కొత్త ట్విస్ట్.. 9 కాదు 10 హత్యలు..

వరంగల్‌‌లోని గొర్రెకుంట వద్ద బావిలో తొమ్మిది శవాల మర్డర్ మిస్టరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మర్డర్ కేసులోని మిసర్టీని 72 గంటల్లో చేధించారు పోలీసులు. అయితే రైలులో చనిపోయిన మహిళతో కలిపి మొత్తం 10 హత్యలు...

వరంగల్ మర్డర్ మిస్టరీలో కొత్త ట్విస్ట్.. 9 కాదు 10 హత్యలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2020 | 5:49 PM

వరంగల్‌‌లోని గొర్రెకుంట వద్ద బావిలో తొమ్మిది శవాల మర్డర్ మిస్టరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మర్డర్ కేసులోని మిసర్టీని 72 గంటల్లో చేధించారు పోలీసులు. అయితే రైలులో చనిపోయిన మహిళతో కలిపి మొత్తం 10 హత్యలు చేసింది.. బీహార్‌కి చెందిన సంజయే అని నిర్థారణ అయింది. శీతల పానీయంలో నిద్ర మాత్రలు కలిపి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. విచారణలో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ పది మందిని హత్య చేసిన నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చారు వరంగల్ సీపీ రవీందర్. ఈ మేరకు సీపీ ఒళ్లు గగుర్పొడిచే పలు విషయాలను వెల్లడించారు.

మీడియాతో సీపీ రవీందర్ మాట్లాడుతూ..

– గొర్రెకుంట దుర్ఘటన చాలా విచారకరం – ఒక హత్య నుంచి తప్పించుకునేందుకు మరో 9 హత్యలు చేశాడు – ఈ కేసులు ఛేదించేందుకు ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం – ఈ నెల 21న నాలుగు మృతదేహాలు బావి నుంచి వెలికి తీశాం – మరో రోజున ఇంకో ఐదు మృతదేహాలు బయటకు తీశాం – మక్సూద్ కుటుంబానికి సంజయ్‌తో పరిచయం – నిషా సోదరి రఫీకా హత్యను కప్పిపూడ్చుకోవడం కోసం ఈ తొమ్మిది హత్యలు చేశాడు – సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితున్ని గుర్తించాము – 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్డకొడుకు జన్మదిన వేడుకలరోజు తన మర్డర్ స్కెచ్‌కు వేదికగా మార్చుకున్నాడు – వారు తినే అన్నంలో నిద్రమాత్రలు పొడిచేసి కలిపాడు.. వారంతా మత్తులోకి జారుకున్న తర్వాత గోనెసంచిలో ఈడ్చుకెళ్ళి బావిలో పడేశాడు – ఈ హత్యలన్నీ అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగాయి – ప్రిస్కిప్షన్ లేకుండా ఇన్ని స్లీపింగ్ పిల్స్ అమ్మిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకునేలా డ్రగ్ ఇన్ స్పెక్టర్‌కు సిఫారసు చేశాము.

మరిన్ని విషయాలను ఈ కింది లైవ్‌లో చూడండి:

Read More: 

స్కుళ్లు ఓపెన్ చేసిన తొలిరోజే.. జగనన్న విద్యా కానుక

‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..