టీడీపీ మాజీ ఎమ్మెల్యే ‌కూన రవికుమార్​పై కేసు నమోదు..

శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసుస్టేషన్‌లో ఆమదాలవలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఫోన్‌లో దుర్భాషలాడుతూ బెదిరించారని… బదిలీపై వెళ్లిన తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చారు. తహసీల్దార్‌ రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు శ్రీకాకుళంలోని ఆయ‌న ఇంటికి వెళ్లారు. ఆయన అక్క‌డ‌ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఏం జ‌రిగిందంటే.. కొద్ది రోజుల క్రితం పొందూరు మండలం గోరంట్ల గ్రామం ద‌గ్గ‌ర్లో అక్రమంగా తరలిస్తున్న […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:58 pm, Mon, 25 May 20
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ‌కూన రవికుమార్​పై కేసు నమోదు..

శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసుస్టేషన్‌లో ఆమదాలవలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఫోన్‌లో దుర్భాషలాడుతూ బెదిరించారని… బదిలీపై వెళ్లిన తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చారు. తహసీల్దార్‌ రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు శ్రీకాకుళంలోని ఆయ‌న ఇంటికి వెళ్లారు. ఆయన అక్క‌డ‌ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.

ఏం జ‌రిగిందంటే..

కొద్ది రోజుల క్రితం పొందూరు మండలం గోరంట్ల గ్రామం ద‌గ్గ‌ర్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక‌ వెహిక‌ల్స్ ను వీఆర్వో సమాచారం మేరకు ఎమ్మార్వో సీజ్ చేశారు. ఆ వాహనాలు కూన రవికుమార్ కు చెందిన‌వి కావటంతో సీజ్ చేసిన వాటిని వెంట‌నే విడిచిపెట్టాలని మాజీ ఎమ్మెల్యే తనకి ఫోన్ చేసి బెదిరించారని, దుర్భాషలు ఆడారని ఎమ్మెర్వో ఆడియో క్లిప్ ను పోలీసుల‌కు అంద‌జేశారు.