కాబూల్.. ఈద్ ఆఫర్.. 2 వేలమంది తాలిబన్ ఖైదీల విడుదల !

ఆఫ్ఘనిస్తాన్ లో రెండు వేల మందికి పైగా తాలిబన్ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసేందుకు అధ్యక్షుడు అష్రఫ్ ఘని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా తాము తుపాకులు వదిలి కాల్పుల విరమణ పాటిస్తామని తాలిబన్లు ప్రకటించడంతో ఘని కూడా ఖైదీల విడుదలకు ఓకె చెప్పారు. మూడు రోజుల పాటు తాము  ఆయుధాలు చేతబట్టబోమన్న  తాలిబన్ల హామీని ఆయన విశ్వసించారు. తమ నేత ‘గుడ్ విల్ గెస్చర్’ ఇక శాంతి ప్రక్రియ సక్సెస్ కావడానికి కారణమవుతుందని  […]

కాబూల్.. ఈద్ ఆఫర్.. 2 వేలమంది తాలిబన్ ఖైదీల విడుదల !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 5:05 PM

ఆఫ్ఘనిస్తాన్ లో రెండు వేల మందికి పైగా తాలిబన్ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసేందుకు అధ్యక్షుడు అష్రఫ్ ఘని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా తాము తుపాకులు వదిలి కాల్పుల విరమణ పాటిస్తామని తాలిబన్లు ప్రకటించడంతో ఘని కూడా ఖైదీల విడుదలకు ఓకె చెప్పారు. మూడు రోజుల పాటు తాము  ఆయుధాలు చేతబట్టబోమన్న  తాలిబన్ల హామీని ఆయన విశ్వసించారు. తమ నేత ‘గుడ్ విల్ గెస్చర్’ ఇక శాంతి ప్రక్రియ సక్సెస్ కావడానికి కారణమవుతుందని  ఆశిస్తున్నట్టు ఘని అధికార ప్రతినిధి సెదిఖ్  సెదిఖీ ట్వీట్ చేశారు. తాలిబన్లకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య గత ఫిబ్రవరిలో శాంతి ఒప్పందం కుదిరింది. ఆ అగ్రిమెంట్ కుదర్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది. తమ చెరలో ఉన్న వెయ్యి మంది ఆఫ్ఘన్ సెక్యూరిటీ దళాలను విడుదల చేస్తామని తాలిబన్లు ప్రకటిస్తే.. ఇందుకు బదులుగా 5 వేల మంది తాలిబన్ ఖైదీలను రిలీజ్ చేస్తామని ఆఫన్ ప్రభుత్వం నాడు పేర్కొంది. అటు-నిన్న తాలిబన్ల ప్రతిపాదన రాకముందే ఘని ప్రభుత్వం వెయ్యి మంది ఖైదీలను విడుదల చేసింది. అలాగే తాలిబన్లు కూడా మూడు వందల మంది ఆఫ్ఘన్ జవాన్లను రిలీజ్ చేశారు. తాలిబన్లతో శాంతి చర్చలు ప్రారంభించడానికి తాము సిధ్ధంగా  ఉన్నామని అష్రఫ్ ఘని మళ్ళీ ప్రకటించారు.

Latest Articles