AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న కూతుర్లను బండరాయితో కొట్టి చంపిన కసాయి తండ్రి

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. మద్యంమత్తులో మానవ మృగంలా మారాడు. కన్న కూతుర్లిద్దరిని అతి కిరాతకంగా కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. సంత్​కబీర్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన కన్న కూతుర్లిద్దరిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సంత్​కబీర్ నగర్ జిల్లాలోని బెల్హెర్ పోలీసు సర్కిల్ పరిధిలోని బాబెతు గ్రామానికి చెందిన జైనాబ్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు […]

కన్న కూతుర్లను బండరాయితో కొట్టి చంపిన కసాయి తండ్రి
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 4:18 PM

Share

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. మద్యంమత్తులో మానవ మృగంలా మారాడు. కన్న కూతుర్లిద్దరిని అతి కిరాతకంగా కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. సంత్​కబీర్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన కన్న కూతుర్లిద్దరిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సంత్​కబీర్ నగర్ జిల్లాలోని బెల్హెర్ పోలీసు సర్కిల్ పరిధిలోని బాబెతు గ్రామానికి చెందిన జైనాబ్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ ఘటన జరిగిందని తెలిపారు. జైనాబ్ తాగుడుకు బానిస కావడంతో భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో కూతుర్లు అల్లుమిన్ నిషా(5), రూబీ(3) తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి పీకలదాకా తాగి వచ్చి ఇద్దరు చిన్నారులను బండరాయితో కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పిల్లలు రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటుండగా జైనాబ్ చలనం లేకుండా ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Follow Us
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!