AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : మహేష్ బాబు పక్కన ఆ హీరోయిన్.. చాలా మంది వద్దు అన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో శ్రీను వైట్ల ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. అయితే గతంలో ఓ ఇంట్రవ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మహేష్ బాబు పక్కన హీరోయిన్ ఎంపిక విషయంలో వచ్చిన సవాళ్లు, విమర్శల గురించి చెప్పుకొచ్చారు.

Tollywood : మహేష్ బాబు పక్కన ఆ హీరోయిన్.. చాలా మంది వద్దు అన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2026 | 9:11 PM

Share

దూకుడు చిత్రం విడుదలై దశాబ్దం దాటినా ఆ సినిమా మేకింగ్ వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ముఖ్యంగా, సూపర్‌స్టార్ మహేష్ బాబు పక్కన సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేయడం వెనుక ఉన్న కీలక విషయాలు దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా వెల్లడించారు. సమంత అప్పటికి తెలుగులో ఏ మాయ చేసావె చిత్రంతో మాత్రమే ప్రధాన నాయికగా నటించి, బృందావనం సినిమాలో ఒక నాయికగా కనిపించారు. ఈ నేపథ్యంలో, ఆమెను మహేష్ బాబు లాంటి ఒక అగ్ర కథానాయకుడి పక్కన సోలో హీరోయిన్‌గా తీసుకోవడంపై ఇండస్ట్రీలో చాలా మందికి అపోహలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సమంతను ఐరన్ లెగ్ అని పిలిచేవారన్న ప్రస్తావన కూడా వచ్చింది. కానీ, శ్రీను వైట్ల మాత్రం సమంత ఫ్రెష్‌గా కనిపిస్తారని, ఏ మాయ చేసావెలో ఆమె నటన తనకు నచ్చిందని బలంగా నమ్మినట్లు చెప్పుకొచ్చారు.

ఈ దశలో, మహేష్ బాబు సోదరి మంజుల సమంతను రికమెండ్ చేయడం ఒక కీలక మలుపు. దర్శకుడి నమ్మకం, మంజుల గారి సిఫార్సుతో పాటు, స్వయంగా మహేష్ బాబు సమంతను హీరోయిన్‌గా అంగీకరించడంతో ఆమె దూకుడు చిత్రంలో భాగమయ్యారు. సమంత తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ అద్భుతంగా నటించారు. సినిమాలో కొన్ని డైలాగులు, ఉదాహరణకు “నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి”, “నేను నుంచుంటే ఫస్ట్ ఫ్లోర్” వంటివి ఆ రోజుల్లో కొంత చర్చకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ, సమంత వాటిని స్పోర్టివ్‌గా తీసుకుని, సన్నివేశాలను బాగా ఎంజాయ్ చేసి నటించారని శ్రీను వైట్ల గుర్తు చేసుకున్నారు. దూకుడు చిత్రం విడుదలైనప్పుడు, అప్పట్లో సినిమాలపై ప్రజల అవగాహన ఇప్పుడున్నంత విస్తృతంగా లేదు. కొన్ని సంఘాలు హీరోయిన్లను తక్కువ చేసి చూపించినా వివాదాలు రేపే అవకాశాలు ఉండేవి. అయితే, శ్రీను వైట్ల ఈ అంశాన్ని చాలా తెలివిగా డీల్ చేశారు. తన సినిమాల్లో తరచుగా హీరోయిన్లే హీరోలను వెంటపడేలా చూపించిన మహేష్ బాబు విషయంలో, దూకుడులో మాత్రం రివర్స్‌లో కథనాన్ని నడిపించారు. మహేష్ బాబు పాత్ర సమంత పాత్రను వెంటపడేలా చూపించారు. ఇది మహిళల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుతుందని శ్రీను వైట్ల వివరించారు.

సమంత పాత్రకు వర్కౌట్ కాకపోవడంతో కలిగే కోపాన్ని, ఫ్రస్ట్రేషన్‌ను మాత్రమే సినిమాలో చూపించారని, దానివల్ల కథకు మరింత బలం చేకూరిందని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా, సమంత పాత్రను నెగెటివ్‌గా కాకుండా, ఆమెకు తన పట్ల ఆసక్తి లేదని తెలిసినప్పుడు మహేష్ బాబు పాత్ర వెంటపడడం ద్వారా, కథలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారని దర్శకుడు స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

దూకుడు సినిమా..

Mahesh Babu, Samantha

Mahesh Babu, Samantha

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us