శ్రావణ మాసంలో తులసి చెట్టు విషయంలో చేయకూడని తప్పులు ఇవే!
Samatha
8 August 2026
శ్రావణ మాసంలో తులసి చెట్టును పూజించడం చాలా మంచిది అంటారు. అంతే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణ మాసంలో తులసి చెట్టు విషయంలో కొన్ని తప్పులు అస్సలే చేయకూడదు అంటున్నారు నిపుణ
ులు.
కాగా, ఇప్పుడు మనం శ్రావణ మాసంలో తులసి చెట్టు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో స్నానం
చేయకుండా తులసిని ముట్టుకోకూడదు.
రాత్రి సమయంలో కొంత మంది తులసి చెట్టుకు నీళ్లు పోయడం చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టుకోవడం నీళ్లు పోయడం చేయకూడదు.
అదే విధంగా తులసి చెట్టు ఆకులను గోరుతో గిచ్చడం, కత్తెరతో కోయడం అస్సలే మంచిది కాదు అంటారు. అలాగే తులసి చెట్టును ఎప్పుడూ పూజించాలి.
రజస్వలం సమయంలో తులసి మొక్కను అస్సలే తాకకూడదు. అంతే కాకుండా కోపంతో తులసి ఆకులు తుంచడం లాంటివి చేయకూడదు ఇది సమస్యలకు కారణం అవుతుంద
ి.
గ్రహణం సమయంలో, ఆది వారం రోజు, వరలక్ష్మీ వ్రతం సమయంలో తులసి చెట్టు ఆకులు కోయడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే