AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరానికి చలువ చేసే కమ్మటి సగ్గుబియ్యం హల్వా.. తక్కువ సమయంలోనే ఇలా చేసుకోండి!

Sabudana Halwa Recipe: ఏమైనా తియ్యగా తినాలనిపించినప్పుడు శరీరానికి చలువ చేసే పదార్థాలతో స్వీట్స్ తయారు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అలాంటి ఆరోగ్యకరమైన తీపి వంటకాలలో 'సగ్గుబియ్యం హల్వా' ఒకటి. సగ్గుబియ్యం శరీరానికి చలువ చేయడమే కాకుండా పొట్టకి ఎంతో హాయిని ఇస్తుంది. సాధారణంగా సగ్గుబియ్యంతో పాయసం లేదా వడలు చేస్తుంటాం. 

Phani CH
|

Updated on: Aug 08, 2026 | 7:45 PM

Share
సగ్గుబియ్యంను మెత్తగా రుబ్బి, కమ్మటి బెల్లం, నెయ్యి కాంబినేషన్‌లో హల్వా చేస్తే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. తక్కువ సమయంలోనే నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువుగా ఉండే ఈ సాబుదానా హల్వాను ఎంతో సులభంగా తయారు చేయవచ్చు.

1 / 5
ఈ సగ్గుబియ్యం హల్వా తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో అర కప్పు సగ్గుబియ్యం తీసుకుని, రెండు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లు పోసి కనీసం 3 గంటల పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత నీళ్లతో సహా మిక్సీ జార్‌లో వేసి పలుకులు లేకుండా మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు పలుకులను దోరగా వేయించి పక్కన తీసుకోవాలి. అదే నేతిలో అర కప్పు చక్కెర, రెండు స్పూన్ల నీళ్లు వేసి చక్కెర కరిగి లైట్ గోల్డెన్ క్యారెమెల్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు, ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము వేసి బెల్లం పూర్తిగా కరిగేలా మరిగించాలి.

3 / 5
బెల్లం కరిగాక గ్రైండ్ చేసిన సగ్గుబియ్యం పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా విస్కర్ లేదా గరిటెతో బాగా కలపాలి. మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్‌పై కలుపుతూ ఉడికిస్తూ, మధ్యమధ్యలో 3-4 టీస్పూన్ల నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి.

4 / 5
హల్వా దగ్గరపడి బాండీ నుండి విడివడుతున్న సమయంలో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. సిద్ధమైన ఈ హల్వాను ప్లేట్‌లో వేసుకుని వేడిగా లేదా చల్లారిన తర్వాత తింటే అమృతతుల్యమైన రుచి లభిస్తుంది.

5 / 5
Follow Us