Maoists Letter: శాంతి చర్చలకు మేం సిద్ధం.. కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టుల సంచలన లేఖ..
శాంతి చర్చలకు మేం సిద్ధం... మీరు సిద్ధమేనా...! అయితే రండి చర్చించుకుందాం అంటూ కేంద్రానికి మావోయిస్టులు లెటర్ రాయడం హాట్‌టాపిక్‌గా మారింది. మరి మావోయిస్టుల లెటర్‌పై కేంద్రం రియాక్షన్ ఎలా ఉండబోతోంది...? అసలు ఆల్ ఆఫ్ సడెన్‌గా మావోలు స్వరం మార్చడానికి కారణాలేంటి...? ఈ వివరాలను ఒకసారి చూడండి..

కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు సంచలన లేఖ రాశారు. శాంతిచర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లెటర్‌ను రిలీజ్ చేశారు. ప్రజాప్రయోజనాల కోసం తాము ఎలాంటి చర్చలకైనా సిద్ధమే అన్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో కాల్పులు విరమించాలని కోరారు. చర్చలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైతే.. తక్షణమే కాల్పుల విరమణకు తాము కూడా సిద్ధమేనని లేఖలో వివరించారు. శాంతిచర్చల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని మేధావులు, రచయితలు, హక్కుల సంఘాలకు మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఇక 2004లో ఏపీ ప్రభుత్వంతో మావోయిస్టుల శాంతిచర్చలు జరిగిన తర్వాత.. సుమారు 20 ఏళ్లకు మళ్లీ శాంతిచర్చల కోసం మావోయిస్టులు ప్రతిపాదన చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇటు కొన్నాళ్లుగా మావోయిస్ట్ రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. గత 100 రోజుల్లో ఎన్‌కౌంటర్‌ల ద్వారా 120 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మరోవైపు పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు. మరి మావోయిస్టుల లెటర్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుంది…? రండి కూర్చుని మాట్లాడుకుందాం అంటుందా… లేక ఏం పట్టించుకోకుండా ఆపరేషన్ కగాన్‌ను కంటిన్యూ చేస్తుందా చూడాలి…!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..