200 మంది పోలీసులతో గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు..
200 మంది పోలీసులతో గాంధీ ఆస్పత్రికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కరోనా పేషంట్లకు వైద్య సేవలందిస్తోన్న డాక్టర్లకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం కరోనా పాజిటివ్ రోగులు డాక్టర్లపై దాడికి..

200 మంది పోలీసులతో గాంధీ ఆస్పత్రికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కరోనా పేషంట్లకు వైద్య సేవలందిస్తోన్న డాక్టర్లకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం కరోనా పాజిటివ్ రోగులు డాక్టర్లపై దాడికి దిగిన ఘటన సంచలనమైంది. ఈ నేథప్యంలో మరలా దాడి జరిగే అవకాశం ఉన్నందున భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న వారిపై దాడి చేయడం సరికాదన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి వైద్యులపై దాడి జరగకుండా ఆసుపత్రి వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఐసోలేషన్ వార్డులున్న 5, 6, 7, 8 అంతస్తులకు మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. అంతేకాకుండా ఇద్దరు అదనపు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 27 మంది ఎస్‌ఐలు సహా మొత్తం 200 మంది గాంధీ ఆస్పత్రి వద్ద మోహరించారు. కాగా మొత్తం నాలుగు అంతస్తుల్లో.. మొదటి 5,6 ఫ్లోర్స్‌లో ఐసోలేషన్ వార్డు ఉండగా, 7,8 అంతస్తుల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తారు.
ఇవి కూడా చదవండి:
చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా
గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్
వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..
విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం
ప్రభాస్ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు
దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే