India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కేరళలోనే 30 వేల కేసుల నమోదు..
Covid-19 Cases in India: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో
Covid-19 Cases in India: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో 42,766 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో దాదాపు 30వేల కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో 29,682 కేసులు నమోదు కాగా.. 142 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 308 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,29,88673 కి చేరగా.. మరణాల సంఖ్య 4,40,533 కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 38,091 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,21,38092కి పెరిగింది. ఈమేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 4,10,048 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 97.42 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 66.89 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర తెలిపింది. రాష్ట్రాల దగ్గర 4.37కోట్ల డోసులు ఉన్నట్లు తెలిపింది.
Also Read: