Student Scholarship: ఈ నాలుగు రాష్ట్రాల విద్యార్థులకు విప్రో బంపర్ ఆఫర్.. 24 వేల రూపాయల స్కాలర్‌షిప్..
ఇలాంటి వారికి విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థ స్కాలర్‌షిప్‌ల ద్వారా తమవంతు ఆర్దిక సహాయంను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను పేద విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మనదేశంలో అక్షరాస్యత వేగంగా పెరుగుతోంది. అయితే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిల్లో చదువుతున్న శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అందులోనూ గ్రామీణ స్థాయిలో మరింత పెరగాల్సిన అవసరం ఉందని చాలా పరిశోధనలు పేర్కొంటున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది అమ్మాయిలు తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల కూడా చదువుకు దూరమవుతున్నారు. దీంతో కొంత వరకు చదవి మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి వారికి విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థ స్కాలర్‌షిప్‌ల ద్వారా తమవంతు ఆర్దిక సహాయంను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను పేద విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పేద విద్యార్థినులకు ఆర్థిక చేయూత అందించాలనే ఓ మంచి సంకల్పంతో విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థ విప్రో కేర్స్‌తో కలిసి 2016-17లో ‘సంతూర్ స్కాలర్‌షిప్’ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. దీని ద్వారా ఏదైనా డిగ్రీ చదవాలనుకునే నిరుపేద విద్యార్థినులకు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ సంస్థ చాలా మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను అందించింది. ఈ సహాయాన్ని దాదాపు 4200 మంది విద్యార్థినులు పొందినట్లుగా తెలుస్తోంది. అయితే.. తాజాగా 2022-23 సంవత్సరానికి.. అంటే ఈ ఏడాదికిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అయితే ఈ ‘సంతూర్ స్కాలర్‌షిప్’ కోసం నవంబర్ 15, 2022 చివరి తేదీగా నిర్ణయించారు. సంతూర్ స్కాలర్‌షిప్‌కు ఎవరు అర్హులు, ఏం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. దరఖాస్తు విధానం వంటి అన్ని వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు సంవత్సరానికి 24 వేల రూపాయల చొప్పున అందిస్తారు. ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీ లేదా చదువుకు సంబంధించిన ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
స్కాలర్‌షిప్ పందేందుకు అర్హతలు
- సంతూర్ స్కాలర్‌షిప్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన నిరుపేద విద్యార్థినులు మాత్రమే అర్హులు.
- స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- 2021-22 విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వ పాఠశాల/జూనియర్ కాలేజీలో పూర్తి చేసి ఉండాలి.
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెగ్యులర్ డిగ్రీ కోర్సులో నమోదు చేసుకుని ఉండాలి.
- దీనికి సంబంధించిన ఫ్రూఫ్ అంటే.. ఫీజు చెల్లించిన రశీదులు, కాలేజీ అడ్మిషన్ లెటర్, ఐడీ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్‌ను స్కాలర్‌షిప్ అప్లికేషన్‌తోపాటు జతచేయాల్సి ఉంటుంది. కోర్సు కాలపరిమితి కనీసం 3 సంవత్సరాలు ఉండాలి.
- ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌లో చూడచ్చు.
మరిన్ని కెరీర్ అండ్ జాబ్ న్యూస్ కోసం