Kits Warangal Faculty: వరంగల్ కిట్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. అర్హులెవరు? ఎలా దరాఖాస్తు చేసుకోవాలి..
Kits Warangal Faculty Recruitment 2021: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఈ అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లో...
Kits Warangal Faculty Recruitment 2021: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఈ అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిన్సిపల్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. మాస్టర్స్ అభ్యర్థులకు నెట్/ స్లేట్/ సెట్ అర్హతతో పాటు టీచింగ్/ పరిశోధనలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులను అకడమిక్‌లో చూపిన ప్రతిభ, అనుభవం ప్రాతిపదికగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు వివరాలను ది ప్రిన్సిపల్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్, 506015 దరఖాస్తుకు పంపించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు 06-07-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Telangana Schools: పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొద్ది రోజులపాటు..