UPSC Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ దరఖాస్తుల స్వీకరణకు ముగుస్తోన్న గడువు.. వెంటనే అప్లై చేసుకోండి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023ని విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023ని విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (21-02-2023) గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ(యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ). లేదా బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, ఫారెస్ట్రీ లేదా ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (21-02-2023) ముగియనుంది.
* ప్రాథమిక పరీక్షను 28-05-2023 రోజున నిర్వహిస్తారు.
* రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, అనంతపురం, వరంగల్, విజయవాడ, తిరుపతిలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..