AP Constable Physical Tests: కానిస్టేబుల్ పోస్టులకు మార్చి 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు.. తుది రాత పరీక్ష ఎప్పుడంటే
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ)లను మార్చి 13 నుంచి నిర్వహించనున్నట్లు..
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ)లను మార్చి 13 నుంచి నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం (ఫిబ్రవరి 20) వెల్లడించింది. ఫిజికల్ టెస్టులకు ఎంపికైన మహిళ/పురుష అభ్యర్ధులందరూ ఆయా తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో హాజరుకావల్సి ఉంటుందని బోర్డు సూచించింది. ఈ మేరకు తెలియజేస్తూ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది.
ఇక కానిస్టేబుల్ స్టేజీ 2 అన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రక్రియ ఈ రోజు (ఫిబ్రవరి 20) ముగియడంతో తదుపరి రిక్రూట్‌మెంట్ వివరాలను ప్రకటనలో పొందుపరిచారు. పీఎంటీ/పీఈటీ కాల్‌లేటర్లు మార్చి 1 మధ్యాహ్నం 3 గంటల నుంచి మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఏప్రిల్ నెల చివరి వారంలో నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది.
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తేదీల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.