AP SI Answer Key 2023: ఏపీ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఆదివారం (ఫిబ్రవరి 19) ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయంత తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్సర్ కీని..

ఆంధ్రప్రదేశ్‌లో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఆదివారం (ఫిబ్రవరి 19) ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయంత తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం (ఫిబ్రవరి 20) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి పేపర్ 1, పేపర్ 2 ఆన్సర్ కీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా ఆదివారం జరిగిన ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్షను 13 జిల్లాల్లో మొత్తం 291 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 1,51,243 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెల్పింది. ఆన్సర్ కీపై ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు సమర్పించాలని బోర్డు తెల్పింది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఏపీ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమ్స్ పేపర్-1 కోసం క్లిక్ చేయండి.




ఏపీ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమ్స్ పేపర్-2 కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
