AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆ కోర్సుల్లో అడ్మిషన్లు వెంటనే ఆపేయండి..’ ఉన్నత విద్యాసంస్థలకు UGC కీలక ఆదేశాలు

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉన్నత విద్యా సంస్థలు అందించే పలు కోర్సులు రద్దు చేయాలని కోరుతూ యూనివర్సిటీలు, కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణ, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ యాక్ట్‌ 2021 కిందికి వచ్చే కోర్సులను ఓపెన్‌, ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో బోధించడం ఇకపై పూర్తిగా నిలిపివేయాలని..

'ఆ కోర్సుల్లో అడ్మిషన్లు వెంటనే ఆపేయండి..' ఉన్నత విద్యాసంస్థలకు UGC కీలక ఆదేశాలు
Universities Directed Not To Offer Healthcare, Allied Courses In Online Mo
Srilakshmi C
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 10:05 AM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 16: ఉన్నత విద్యా సంస్థలు అందించే పలు కోర్సులు రద్దు చేయాలని కోరుతూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణ, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ యాక్ట్‌ 2021 కిందికి వచ్చే కోర్సులను ఓపెన్‌, ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో బోధించడం ఇకపై పూర్తిగా నిలిపివేయాలని కాలేజీలు, యూనివర్సిటీలను ఆదేశించింది. ఓపెన్‌, ఆన్‌లైన్ పద్ధతుల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించరాదని స్పష్టం చేసింది.

జులై-ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. జూలై 23, 2025న జరిగిన UGC 592వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. ఏప్రిల్ 22న జరిగిన 24వ దూర విద్య బ్యూరో వర్కింగ్ గ్రూప్ సమావేశం సిఫార్సులను అందించింది. తాజాగా దీనిపై ప్రకటన వెలువరించింది. ఈ ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ODL, ఆన్‌లైన్ మోడ్‌లో ప్రవేశాలు కల్పించడానికి అనుమతించబడవని పేర్కొంది.

ఈ నిషేధం సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి స్పెషలైజేషన్లకు వర్తిస్తుంది. అలాగే సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషియన్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌ సహా ఆరోగ్య సంరక్షణ కోర్సులన్నింటిపై నిషేధం కొనసాగుతుందని యూజీసీ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, గణితం, ప్రజా పరిపాలన, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, గణాంకాలు, మానవ హక్కులు – విధులు, సంస్కృతం, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మహిళా అధ్యయనాలు వంటి అంశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ వంటి బహుళ స్పెషలైజేషన్లను యథాతథంగా అందిస్తామని, కేవలం ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన స్పెషలైజేషన్ కోర్సులను మాత్రమే ఉపసంహరించుకుంటున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి