AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS PO 2025 Exams: రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) ప్రిలిమ్స్‌ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

IBPS PO 2025 Exams: రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే
IBPS PO 2025 prelims exams
Srilakshmi C
|

Updated on: Aug 16, 2025 | 11:56 AM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 16: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) ప్రిలిమ్స్‌ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌, రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను పొందవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ప్రిలిమ్స్ రాత పరీక్షలు ఆగస్టు 17, 23, 24 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆగస్ట్ 19, 20 తేదీల్లో తెలంగాణ డీఈడీ సీట్లకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆగస్టు 19, 20 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 235 ప్రభుత్వ డైట్‌ కళాశాలల్లో, 579 ప్రైవేటు కళాశాలల్లో సీట్లు మిగిలిపోయినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఓ ప్రటకనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి మొత్తం 1,131 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ సీట్లకు ఆగస్ట్‌ 19న, ప్రైవేటు సీట్లకు ఆగస్ట్ 20న ఆయా కళాశాలల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, అర్హత కలిగిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందొచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఎడ్‌సెట్‌ రిపోర్టింగ్‌ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

తెలంగాణ ఎడ్‌సెట్‌ తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ చేసే గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ.పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు, సెలవుల కారణంగా ఈ గడువును పెంచినట్లు తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా