APP Job Notification 2025: పోలీస్ శాఖలో ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?
రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (APP) నియామకానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీజీపీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టుల భర్తీకి ఈ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని..

హైదరాబాద్, ఆగస్ట్ 16: తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (APP) నియామకానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీజీపీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టుల భర్తీకి ఈ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తన ప్రకటనలో పేర్కొంది. మొత్తం పోస్టుల్లో మల్టీజోన్ 1లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 38 పోస్టులు, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ (బ్యాక్‌లాగ్) కింద 12 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్-2లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 57 పోస్టులు ఉండగా.. లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 11 పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు లో చేసుకోవాలని నియామక టీజీపీఆర్‌బీ ఛైర్మన్ శ్రీనివాసరావు సూచించారు.
తెలంగాణలో డ్యూయల్ కోర్సులో ప్రవేశానికి మరో రెండు రోజుల్లో కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా బీఎస్సీ వ్యవసాయ డ్యూయల్ డిగ్రీ కోర్సులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 18న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ విద్యాసాగర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. సంబంధిత సర్టిఫికెట్లను విద్యార్ధులు తమతో తెచ్చుకోవాలని తెలిపారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్ధులందరికీ త్వరలోనే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




