TSPSC Documents Verification: ఉద్యోగాల భర్తీ వేగవంతం చేసిన టీఎస్‌పీఎస్సీ.. త్వరలో సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు వెల్లడి!

ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చర్యలు మొదలుపెట్టింది. వివిధ ఉద్యోగాల పరీక్షల ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి బుధవారం (ఫిబ్రవరి 21) ప్రకటించారు. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌)ను విడుదల చేసింది కూడా. ఇందులో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌..

TSPSC Documents Verification: ఉద్యోగాల భర్తీ వేగవంతం చేసిన టీఎస్‌పీఎస్సీ.. త్వరలో సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు వెల్లడి!
TSPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 22, 2024 | 7:34 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చర్యలు మొదలుపెట్టింది. వివిధ ఉద్యోగాల పరీక్షల ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి బుధవారం (ఫిబ్రవరి 21) ప్రకటించారు. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌)ను విడుదల చేసింది కూడా. ఇందులో టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ 175 పోస్టులు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ 18 పోస్టులు, హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ 22 పోస్టులు, ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్‌ 77 పోస్టులు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ 117 పోస్టులు, గ్రూప్‌–4 కింద 8180 పోస్టులకు సంబంధించి వెబ్‌సైట్‌లో జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ అందుబాటులో ఉంచింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపడుతామని, అందుకోసం అభ్యర్థులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలో కేటగిరీల వారీగా మెరిట్‌ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను కమిషన్‌ త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తామని పేర్కొంది. ఆ తర్వాత తుది జాబితాలు విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు అవసరమైన అన్ని రకాల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్‌, బీసీలకు నాన్‌-క్రీమీలేయర్‌, స్టడీ/రెసిడెన్సీ, రిజర్వేషన్‌ క్లైమింగ్‌తోపాటు విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కమిషన్‌ నిర్దేశించిన తేదీలతో సిద్ధం చేసుకోవాలని తెలిపింది. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

మున్సిపల్‌ శాఖలో వివిధ పోస్టులకు జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టు విడుదల

అలాగే పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్‌ ఆఫీసర్, జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టు (టీఎస్‌పీఎస్సీ)ను కమిషన్‌ విడుదల చేసింది. ఈ జాబితాను కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..