AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు

ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఆయన విద్యార్ధులకు హాల్‌టికెట్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న..

AP Inter Hall Tickets 2024: ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు
AP Inter Hall Tickets 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 22, 2024 | 7:57 AM

అమరావతి, ఫిబ్రవరి 22: ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఆయన విద్యార్ధులకు హాల్‌టికెట్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాడు–నేడు కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. సమగ్ర శిక్ష, ఎస్‌సీఈఆర్టీ, ఎఫ్‌ఎల్‌ఎన్, సాల్ట్, ప్రథమ్, ఎల్‌ఎఫ్‌ఈ, శామో, టోఫెల్‌ నిర్వహణ తదితర విభాగాల ప్రతినిధులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘భాషిణి, డిజీ లాకర్‌’ వంటి యాప్స్‌ ప్రత్యేకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, వారికి వాటిపై అవగాహన పెంపొందించాలని ప్రవీణ్‌ ప్రకాశ్‌ అధికారులను ఆదేశించారు.

విజయవాడలోని ఐబీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ..‘భాషిణి’ యాప్‌ ద్వారా ఇతర భాషల నుంచి వాయిస్, టెక్ట్స్‌ మెసేజ్‌లను అనువాదం చేసుకోవచ్చని అన్నారు. డిజీ లాకర్‌ యాప్‌ ద్వారా ఫార్మెటివ్‌ సమ్మేటివ్‌ పరీక్షల మార్కులను తల్లిదండ్రులు తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని 40 యాజమాన్య పాఠశాలలను ఎస్‌సీఈఆర్టీ, ఐబీ బృందాలు పరిశీలిస్తాయని అన్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు పాఠశాలలను పరిశీలిస్తాయని తెలిపారు. ఈ ప్రక్రియలో పాఠశాలల్లోని విద్యా కార్యక్రమాల తీరును వారు అధ్యయనం చేస్తాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి