TSPSC AMVI Answer Key: టీఎస్‌పీఎస్సీ ఏఎంవీఐ పోస్టుల తుది ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి
అసిస్టెంట్ మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు ఇటీవల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ విడుదల చేశారు. ఈ పోస్టులకు గతేడాది జూన్ 28న సీబీఆర్‌టీ విధానంలో పరీక్ష నిర్వహించారు. జులై 3న ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ జులై 4 నుంచి 6 వరకు అభ్యంతరాలు స్వీకరించింది..
హైదరాబాద్, ఫిబ్రవరి 8: అసిస్టెంట్ మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు ఇటీవల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ విడుదల చేశారు. ఈ పోస్టులకు గతేడాది జూన్ 28న సీబీఆర్‌టీ విధానంలో పరీక్ష నిర్వహించారు. జులై 3న ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ జులై 4 నుంచి 6 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తాజాగా తుది‘కీ’ వెల్లడించింది. ఇదే ఫైనల్ ఆన్సర్ కీ అని, దీనిపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. త్వరలోనే ఫలితాలు కూడా వెల్లడిస్తామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ఏఎంవీఐ పోస్టుల తుది ఆన్సర్ ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. ప్రయోగ పరీక్షలు ఇప్పటికే ప్రారంభం కాగా, ఇవి ఫిబ్రవరి 20వ తేదీతో ముగియనున్నాయి. జనరల్, వోకేషనల్ విభాగాలకు సంబంధించి థియరీ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో తొలుత స్టోరేజ్ పాయింట్లకు పరీక్షా పత్రాలను తరలిస్తారు. ఈ స్టోరేజి పాయింట్ల నుంచి పరీక్షా పత్రాల తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బందో బస్తు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు సంబంధించి తగిన సంఖ్యలో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా చూడాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల వద్ద తాగు నీరు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.