Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Police Training: తెలంగాణ కానిస్టేబుల్‌ కొలువులకు అక్టోబర్‌లో శిక్షణ.. 28 కేంద్రాల్లో ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో చేపట్టిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎస్సై ఎంపిక జాబితా విడుదలైంది. కానిస్టేబుల్‌ ఎంపిక జాబితా కూడా ఆగ‌స్టు చివ‌రిలో లేదా సెప్టెంబరు మొదటి వారంలో ప్రకటించనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ కొలువులకు సంబంధించిన తుది జాబితా విడుదలైన తర్వాత కొత్తగా నియామకం కానున్న ఉద్యోగుల శిక్షణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. కొత్తగా ఎంపికయ్యే 554 మంది ఎస్సై, 9,871 మంది కానిస్టేబుళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు..

TS Police Training: తెలంగాణ కానిస్టేబుల్‌ కొలువులకు అక్టోబర్‌లో శిక్షణ.. 28 కేంద్రాల్లో ఏర్పాట్లు
TS Police Training
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 13, 2023 | 10:00 PM

హైదరాబాద్‌, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో చేపట్టిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎస్సై ఎంపిక జాబితా విడుదలైంది. కానిస్టేబుల్‌ ఎంపిక జాబితా కూడా ఆగ‌స్టు చివ‌రిలో లేదా సెప్టెంబరు మొదటి వారంలో ప్రకటించనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ కొలువులకు సంబంధించిన తుది జాబితా విడుదలైన తర్వాత కొత్తగా నియామకం కానున్న ఉద్యోగుల శిక్షణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. కొత్తగా ఎంపికయ్యే 554 మంది ఎస్సై, 9,871 మంది కానిస్టేబుళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు చేస్తోంది. వీరిలో దాదాపు 2200 మంది మహిళా అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా 3 కేంద్రాలను కేటాయించింది. పోలీసు విచారణ అనంతరం ఎలాంటి సమస్య లేనివారి పేర్లను తుది జాబితాలో చేరుస్తారు. ఎస్సైలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ) ఆధ్వర్యంలో, కానిస్టేబుళ్లకు శిక్షణ విభాగం నేతృత్వంలో దాదాపు 9 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. కానిస్టేబుళ్లకు అక్టోబర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

టీఎస్‌ఎస్‌పీకి రెండో విడతలోనే శిక్షణ

మొత్తం 17,156 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల్లో.. జైళ్లు, ఫైర్‌ తదితర విభాగాల పోస్టులుపోను 14,881 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేయనున్నారు. వీరిలో 5,010 టీఎస్‌ఎస్‌పీ, 4,965 సివిల్‌, 4,523 ఏఆర్‌, 121 పీటీవో, 262 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాల కానిస్టేబుళ్లున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పోలీస్‌శాఖకు 12వేల మందికి సరిపడా మాత్రమే శిక్షణ మైదానాలు మాత్రమే ఉన్నాయి. 2018 నోటిఫికేషన్‌లో ఎంపికైన 16 వేల మంది శిక్షణకు మైదానాలు సరిపోవని టీఎస్‌ఎస్‌పీ శిక్షణను 9 నెలలు వాయిదా వేసింది. ఈసారీ అలాగే చేసే అవకాశం ఉంది. సరిపడా మైదానాలు లేనందున టీఎస్‌ఎస్‌పీ శిక్షణను రెండో విడతలోనే నిర్వహించనున్నారు.

కొత్తగా 94 వైద్య, సాంకేతిక పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ గ్నీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 11 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్‌లాబ్‌, సీటీవీఎస్‌ యూనిట్స్‌ కోసం కొత్తగా 94 వైద్య, సాంకేతిక పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మంజూరైన పోస్టుల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 25 వరకు ఉన్నాయి. వీటన్నింటినీ శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు. ఇతర పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నట్లు సర్కార్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.