TS GENCO Hall Tickets: జెన్‌కో రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. డిసెంబర్ 17న రాత పరీక్ష
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెన్‌కో)లో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శుక్రవారం (డిసెంబర్ 8) విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. డిసెంబర్ 17వ తేదీన .ఓఎంఆర్ షీట్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో రాత పరీక్ష
హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెన్‌కో)లో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శుక్రవారం (డిసెంబర్ 8) విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. డిసెంబర్ 17వ తేదీన .ఓఎంఆర్ షీట్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో రాత పరీక్ష జరగనుంది. కాగా హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు జెన్‌కో సంస్థ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు జెన్‌కో సంస్థ ఇప్పటికే స్పష్ట చేసింది. జెన్‌కో రాత పరీక్ష హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ క్లిక్ చేయండి
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2023 ఫలితాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2023 ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం (డిసెంబర్ 8) విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ప్రధాన పరీక్ష కేంద్రాల్లో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్ధుల పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థులు డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 ను డిసెంబర్ 15లోగా పూరించాల్సి ఉంటుంది. కాగా ప్రతీయేట యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నియామక పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ – మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2023 ఫలితాల కోసం కిక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పదో తరగతి విద్యార్థుల వివరాల సవరణకు అవకాశం
పదో తరగతి విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల సవరణకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. డిసెంబరు 16 నుంచి 20 వరకు అప్లికేషన్‌లలో వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేయాలని పాఠశాలల ప్రిన్సిపల్‌లకు సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.