APPSC Group 2 Notification: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే

ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఏస్సీ) వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. ఈ పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్‌ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటనలో..

APPSC Group 2 Notification: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే
APPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 08, 2023 | 9:42 PM

ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఏస్సీ) వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. ఈ పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్‌ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్‌ రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఫిబ్రవరి 25వ తేదీన ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. మెయిన్స్‌ పరీక్ష తేదీని ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని కమిషన్‌ పేర్కొంది.

శాఖల వారీగా ఖాళీల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 331 వరకు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • ఏపీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III (మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్) పోస్టులు: 4
  • సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II (రిజిస్ట్రేషన్ అండ్‌ స్టాంపుల సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 16
  • డిప్యూటీ తహశీల్దార్ (ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 114
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 28
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీ) పోస్టులు: 16
  • ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (ఏపీ పంచాయతీ రాజ్ అండ్‌ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్‌) పోస్టులు: 2
  • ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏపీ ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్ సబ్-సర్వీస్) పోస్టులు: 150
  • అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 1

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏపీ సెక్రటేరియట్ సబ్-సర్వీస్‌) పోస్టులు: 218
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్‌మెంట్- ఏపీ సెక్రటేరియట్ సబ్-సర్వీస్‌) పోస్టులు: 15
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్- ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్ సబ్-సర్వీస్‌) పోస్టులు: 15
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్- ఏపీ సెక్రటేరియట్ సబ్-సర్వీస్‌) పోస్టులు: 23
  • సీనియర్ ఆడిటర్ (ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 8
  • ఆడిటర్ (పే అండ్‌ అకౌంట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 10
  • సీనియర్ అకౌంటెంట్ బ్రాంచ్-I (కేటగిరీ-I) (హెచ్‌ఓడీ)(ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్-సర్వీస్‌) పోస్టులు: 1
  • సీనియర్ అకౌంటెంట్ బ్రాంచ్-II (కేటగిరీ-I) (డిస్ట్రిక్ట్‌) సబ్-సర్వీస్ (ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) పోస్టులు: 12
  • సీనియర్ అకౌంటెంట్ (ఏపీ వర్క్స్ అండ్‌ అకౌంట్స్‌) (జోన్ వైజ్‌) సబ్ సర్వీస్ పోస్టులు: 2
  • జూనియర్ అకౌంటెంట్ (ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్-సర్వీస్‌) పోస్టులు: 22
  • జూనియర్ అసిస్టెంట్ (ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌) పోస్టులు: 32
  • జూనియర్ అసిస్టెంట్ (ఎకనామిక్స్ అండ్‌ స్టాటిస్టిక్స్‌) పోస్టులు: 6
  • జూనియర్ అసిస్టెంట్ (సోషల్‌ వెల్ఫేర్‌) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్‌ ఆఫ్‌ సివిల్‌ సప్లైస్‌) పోస్టులు: 13
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్‌) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్‌) పోస్టులు: 7
  • జూనియర్ అసిస్టెంట్ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) పోస్టులు: 31
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) పోస్టులు: 7
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్‌ ఆఫ్‌ లేబర్) పోస్టులు: 3
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ) పోస్టులు: 7
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్) పోస్టులు: 3
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్- డీజీపీ) పోస్టులు: 8
  • జూనియర్ అసిస్టెంట్ (డీజీ, ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్ సర్వీసెస్‌) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్‌) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ సైనిక్ వెల్ఫేర్) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (ఏపీ అడ్వకేట్ జనరల్‌) పోస్టులు: 8
  • జూనియర్ అసిస్టెంట్ (ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌) పోస్టులు: 19
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌) పోస్టులు: 4
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌) పోస్టులు: 3
  • జూనియర్ అసిస్టెంట్ (ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్-కమ్-లేబర్ కోర్టు) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (ఇంజినీర్-ఇన్-చీఫ్, పబ్లిక్ హెల్త్‌) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ వెల్ఫేర్‌) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (ఇంజినీర్-ఇన్-చీఫ్, పంచాయతీరాజ్‌) పోస్టులు: 5
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్ ఎడ్యుకేషన్) పోస్టులు: 12
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) పోస్టులు: 20
  • జూనియర్ అసిస్టెంట్ (ఇంజినీర్-ఇన్-చీఫ్‌, ఆర్‌ అండ్‌ బి) పోస్టులు: 7
  • జూనియర్ అసిస్టెంట్ (ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్‌ ఆఫ్‌ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్‌ ఆఫ్‌ యూత్‌సర్వీస్‌) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్ రిసెర్చ్ ల్యాబ్స్‌) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (ప్రివెంటివ్ మెడిసిన్‌) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (గవర్నమెంట్‌ టెక్ట్స్‌ బుక్‌ ప్రెస్) పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌) పోస్టులు: 5
  • జూనియర్ అసిస్టెంట్ (కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్‌) పోస్టులు: 2
  • జూనియర్ అసిస్టెంట్ (టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు: 9
  • జూనియర్ అసిస్టెంట్ (ఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌) పోస్టులు: 1

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 21, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2024.
  • స్క్రీనింగ్ టెస్ట్ తేదీ (ప్రిలిమినరీ ఎగ్జామ్): ఫిబ్రవరి 25, 2024.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.