IDBI recruitment: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జరల్ అభ్యర్థులు రూ. 1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ క్యాటగీరికి చెందిన వారు దరఖాస్తు చేసుకుంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసకునే వారు బీటెక్‌లో సంబంధిత స్ట్రీమింగ్‌లో డిగ్రీని పూర్తి చేయాలి. లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌...

IDBI recruitment: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Idbi Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 09, 2023 | 3:40 PM

ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఐడీబీఐ బ్యాంక్‌ మొత్తం 86 స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) (గ్రేడ్ D) – 1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C) – 39, మేనేజర్ -(గ్రేడ్ B) – 46 (గ్రేడ్ D), 39 ఖాళీలు అసిస్టెంట్‌ పోస్టుల ఉన్నాయి. అలాగే.. జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C), మేనేజర్ -(గ్రేడ్ B) 46 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్‌లో తెలిపారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జరల్ అభ్యర్థులు రూ. 1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ క్యాటగీరికి చెందిన వారు దరఖాస్తు చేసుకుంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసకునే వారు బీటెక్‌లో సంబంధిత స్ట్రీమింగ్‌లో డిగ్రీని పూర్తి చేయాలి. లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.

ఇక ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 7 ఏళ్ల అనుభవం ఉండాలి. మిగతా పోస్టులకు కూడా ప్రత్యేకంగా విద్యార్హతలు, పని అనుభవం పేర్కొన్నారు.

ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం హోమ్‌ పేజీలో ఉండే కెరీర్‌ ట్యాప్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత SO రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ క్రింద ఉన్న అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి. అనంతరం అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి. నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..