APPSC Group 1 Notification 2023: ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. కొంతకాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ - 1,గ్రూప్ - 2 ఉద్యోగాల భర్తీకి ఒక్క రోజు గ్యాప్ తో నోటిఫికేషన్ లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇవాళ గ్రూప్ - 1 నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 81 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి ఆగస్ట్ 28 వ తేదీనే ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే సాంకేతిక కారణాలతో..
విజయవాడ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. కొంతకాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ – 1,గ్రూప్ – 2 ఉద్యోగాల భర్తీకి ఒక్క రోజు గ్యాప్ తో నోటిఫికేషన్ లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇవాళ గ్రూప్ – 1 నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 81 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి ఆగస్ట్ 28 వ తేదీనే ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే సాంకేతిక కారణాలతో నోటిఫికేషన్ జారీ కాస్త ఆలస్యమయింది. గ్రూప్ -1 ఉద్యోగాలకు జనవరి ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 17వ తేదీన గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.సిలబస్ తో పాటు ఇతర వివరాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో పొందుపరిచారు అధికారులు.
ఏపీపీఎస్సీ గ్రూప్ – 1లో భర్తీ చేసే ఉద్యోగాలివే
- డిప్యూటీ కలెక్టర్ పోస్టులు: 9
- స్టేట్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు: 18
- డీఎస్పీ పోస్టులు: 26
- జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు: 1
- డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు:1
- ప్రాంతీయ రవాణా ఆఫీసర్ పోస్టులు: 6
- జిల్లా బీసీ వెల్పేర్ ఆఫీసర్ పోస్టులు:1
- జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు: 3
- ఏపీ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 10
- గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు: 11
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు: 1
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు: 3
- జిల్లా ఉపాధి కల్పనా అధికారుల పోస్టులు: 4
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు: 2
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.