APPMB: ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 170 పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా వున్న దాదాపు 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ /లాటరల్ /కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీసుల రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్ బీ) ప్రకటించింది. వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాస్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను ఈ నెల 18, 20 తేదీలలో విజయవాడ హనుమాన్ పేట పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో..

APPMB: ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 170 పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
AP Medical Board
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Dec 08, 2023 | 4:44 PM

విజయవాడ, డిసెంబర్ 8: తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా వున్న దాదాపు 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ /లాటరల్ /కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీసుల రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్ బీ) ప్రకటించింది. వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాస్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను ఈ నెల 18, 20 తేదీలలో విజయవాడ హనుమాన్ పేట పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈఇ) కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ జరగనుంది.

అలాగే విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) విశాఖపట్నంలో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 15న విశాఖపట్నం హనుమంతవాక జంక్షన్‌లోని విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ జరగనుంది. అభ్యర్ధులు ఆయా తేదీలలో నిర్ణీత ప్రదేశాలలో జరిగే వాక్‌ఇన్ రిక్రూట్మెంట్‌కు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. అర్హతా ప్రమాణాలు, ఇతర మార్గదర్శకాల కోసం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.