AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIASL Recruitment 2023: నెలకు రూ.60,000ల జీతంతో ఎయిర్‌ ఇండియాలో 828 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన.. సీఎస్‌ఈ, యుటిలిటీ ఏజెంట్‌ కం ర్యాంప్‌ డ్రైవర్‌ తదితర పోస్టుల భర్తీకి కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం 828 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులనుబట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్..

AIASL Recruitment 2023: నెలకు రూ.60,000ల జీతంతో ఎయిర్‌ ఇండియాలో 828 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
AIASL Recruitment
Srilakshmi C
|

Updated on: Dec 07, 2023 | 9:45 PM

Share

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన.. సీఎస్‌ఈ, యుటిలిటీ ఏజెంట్‌ కం ర్యాంప్‌ డ్రైవర్‌ తదితర పోస్టుల భర్తీకి కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం 828 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులనుబట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 55 ఏళ్లకు మించి ఉండకూడదు. పోస్టును అనుసరించి ట్రేడ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. 2023, డిసెంబర్‌ 18, 19, 20, 21, 22, 23 తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,6400 నుంచి రూ.60,000వ వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్..

GSD Complex, Near Sahar Police Station, CSMI Airport, Terminal-2, Gate No 5, Sahar, AndheriEast, Mumbai – 400099.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • డిప్యూటీ మేనేజర్ ర్యాంప్/ మెయింటెనెన్స్‌ పోస్టులు: 7
  • డ్యూటీ మేనేజర్- ర్యాంప్ పోస్టులు: 28
  • జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టులు: 24
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 138
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులు: 167
  • డ్యూటీ మేనేజర్- ప్యాసింజర్ పోస్టులు: 19
  • డ్యూటీ ఆఫీసర్- ప్యాసింజర్ పోస్టులు: 30
  • డ్యూటీ మేనేజర్- కార్గో పోస్టులు: 3
  • డ్యూటీ ఆఫీసర్- కార్గో పోస్టులు: 8
  • జూనియర్ ఆఫీసర్- కార్గో పోస్టులు: 9
  • సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 178
  • కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 217

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.