TS TET 2023 Result Date: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2023) ప్రశాతంగా జరిగింది. ఉదయం సెషన్‌లో జరిగిన పేపర్-1 పరీక్షకు కు 84.12 శాతం మంది హాజరయ్యారు. అంటే పేపర్ 1 పరీక్షకు మొత్తం 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు డీఈడీ అభ్యర్ధులతోపాటు బీఈడీ అభ్యర్ధులు కూడా హాజరుకావచ్చు. ఇక బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2కు మొత్తం 91.11 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ..
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2023) ప్రశాతంగా జరిగింది. ఉదయం సెషన్‌లో జరిగిన పేపర్-1 పరీక్షకు కు 84.12 శాతం మంది హాజరయ్యారు. అంటే పేపర్ 1 పరీక్షకు మొత్తం 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు డీఈడీ అభ్యర్ధులతోపాటు బీఈడీ అభ్యర్ధులు కూడా హాజరుకావచ్చు. ఇక బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2కు మొత్తం 91.11 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ సెప్టెంబర్ 19 లేదా 20వ తేదీన కానుంది. అనంతరం ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్ కీతోపాటు ఫలితాలు కూడా వెల్లడిస్తారు. టెట్ పరీక్ష 2023 ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో కొలువు కొట్టాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరనే విషయం అందరికీ తెలిసిందే. టెట్‌లో అర్హత సాధించినవారు మాత్రమే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయడానికి అర్హులుగా విద్యాశాఖ పలుమార్లు పేర్కొంది.
తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ రాత పరీక్ష కీ విడుదల చేసిన టీఎస్పీయస్సీ
తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకీ ఇటీవల రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షల (సీబీఆర్‌టీ) ప్రాథమిక ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా ఆన్సర్ కీలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధుల ఐడీ, పుట్టినతేదీ, సబ్జెక్టు వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక ఆన్సర్ కీపై ఆన్‌లైన్ విధానంలో అభ్యంతాలు తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం టీఎస్పీయస్సీ తుది ఆన్సర్ కీ విడుదల చేస్తుంది.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సబ్జెక్టులవారీగా పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షలు ఆయ పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను ఈ నియాక పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు ఎంపికైతే లెవల్ 9ఎ పోస్టులకు నెలకు రూ.56,100 నుంచి రూ. 1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు, లెవల్-10 పోస్టులకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది.
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ప్రశ్నపత్రాలు, కీల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.