NABARD Recruitment: నాబార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేల వరకు జీతం పొందే అవకాశం
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఐటీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మాస్ కమ్యూనికేషన్, మీడియా స్పెషలిస్ట్ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసకునే అభ్యర్థులు ఖాళీలు ఆధారంగా 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో..
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయిలో కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న నాబార్డ్ శాఖలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఐటీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మాస్ కమ్యూనికేషన్, మీడియా స్పెషలిస్ట్ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసకునే అభ్యర్థులు ఖాళీలు ఆధారంగా 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్, పీజీ, డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఐ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్థులను మొత్తం రెండు రకాల పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్స్‌తో పాటు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 44,500 నుంచి రూ. 89,150 వరకు చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 23వ తేదీతో ముగియనుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..