SBI SCO Recruitment: నిరుద్యోగులకు ఎస్‌బీఐ బంపరాఫర్‌.. భారీగా ఉద్యోగాల భర్తీ

ప్రస్తుతం అధికారులు అప్లికేషన్స్‌ స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 439 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే...

SBI SCO Recruitment: నిరుద్యోగులకు ఎస్‌బీఐ బంపరాఫర్‌.. భారీగా ఉద్యోగాల భర్తీ
SBI JOBS
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 17, 2023 | 6:05 PM

ప్రముఖ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్స్‌ (ఎస్‌బీఐ ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రస్తుతం అధికారులు అప్లికేషన్స్‌ స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 439 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే మరికొన్ని పోస్టులకు ఎమ్‌సీఏ లేదా ఎంటెట్‌/ఎమ్‌ఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ను పూర్తి చేసి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న ‘కెరీర్స్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత అందులోని ఎస్‌సీఓ 2023 రిజిస్ట్రేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.

* ఇప్పుడు ఓపెన్‌ అయిన అప్లికేషన్‌ ఫామ్‌లో అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.

* అప్లికేషన్‌ ఫీజుతో పాటు, అవసరైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

* చివరిగా అప్లికేషన్‌ ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. చివరిగా భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ ఫామ్‌ను ప్రింట్‌ను తీసుకోవాలి.

* ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ. 750 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..