AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS SSC Results 2024: మరికాసేపట్లో తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 30) విడుదలకానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పట్లు పూర్తి చేసింది. టెన్త్‌ ఫలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు..

TS SSC Results 2024: మరికాసేపట్లో తెలంగాణ 'పది' ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి
TS 10th Class Results
Srilakshmi C
|

Updated on: Apr 30, 2024 | 1:08 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 30) విడుదలకానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పట్లు పూర్తి చేసింది. టెన్త్‌ ఫలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు నేరుగా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు 2,676 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్‌ 20 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. ఆ తర్వాత డీ కోడింగ్‌ ప్రక్రియనూ చకచకా పూర్తి చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలతోపాటు పదో తరగతి పరీక్షలను కూడా ఈ సారి విద్యాశాఖ కాస్తముందుగానే నిర్వహించిన సంగతి తెలిసిందే.

పరీక్షల అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కూడా వెంటవెంటనే ముగించింది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ ఫలితాలు కూడా వెల్లడించింది. ఈ రోజు పదో తరగతి ఫలితాల ప్రకటనలకు సమాయాత్తం అవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు కూడా ఈ రోజు తెరపడనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.