TS PECET-2021: విద్యార్థులకు అలర్ట్.. టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్ష వాయిదా..
Physical Efficiency Test: గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు
Physical Efficiency Test: గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 న జరిగే టీఎస్ పీఈసెట్ -2021(TSPECET-2021) ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 30న నిర్వహించాల్సిన టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్షన వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. తెలిపారు. అక్టోబర్ 23న(శనివారం) ఈ పరీక్ష నిర్వహించనన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్లను అక్టోబర్ 23న తీసుకురావాలని, సెంటర్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండవని అధికారులు స్పష్టంచేశారు. టీఎస్ పీఈసెట్ సెట్ ప్రవేశ పరీక్షలో బీపీఈడీకి 2,872 మంది, డీపీఈడీకి 2,183 మంది కలిపి మొత్తం 5,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను తెలంగాణ విద్యాశాఖ వాయిదా వేసింది. వర్షాల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.
Also Read: