TS Eamcet 2023 revised schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు మారాయ్.. కొత్త షెడ్యూల్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా 14,565 బీటెక్ సీట్లకు తెలగాణ సర్కార్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్ధులు మార్పులు చేసుకోవాలని..
తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా 14,565 బీటెక్ సీట్లకు తెలగాణ సర్కార్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్ధులు మార్పులు చేసుకోవాలని తెల్పింది. ఈ క్రమంలో జులై 12వ తేదీ వరకు గడువు పొడిగించారు. స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన ఇతర తేదీల గడువు పొడిగించారు.
జులై 16వ తేదీలోపు సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. జులై 16 నుంచి 22వ తేదీలోపు ఫీజు చెల్లింపులు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వవలసి ఉంటుంది. జులై 22నాటికి తొలి విడత కౌన్సెలింగ్ ముగియనుంది. జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆగస్టు 4 నుంచి 11 వరకు చివరి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.