AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSEAMCET 2021: విద్యార్థులకు అలెర్ట్.. నేడు టీఎస్ ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం.. వివరాలివే..

TS EAMCET Final Phase Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నేడు తుది విడత

TSEAMCET 2021: విద్యార్థులకు అలెర్ట్.. నేడు టీఎస్ ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం.. వివరాలివే..
Tseamcet 2021
Shaik Madar Saheb
|

Updated on: Nov 06, 2021 | 8:38 AM

Share

TS EAMCET Final Phase Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నేడు తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి శని, ఆదివారాల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్ తుదివిడుత కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎంసెట్ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. దీంతోపాటు అభ్యర్థులు స్లాట్‌ కూడా బుకింగ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ తెలిపారు. స్లాట్ బుకింగ్ అనంతరం ఈ నెల 8న అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలిస్తామని వెల్లడించారు. ధ్రవపత్రాల పరిశీలన అనంతరం ఈనెల 9 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని.. 12న తుది విడత సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈనెల 12-15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వెంటనే అడ్మిషన్ పొందిన కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కూడా చేయాల్సి ఉంటుందన్నారు. సీటు రద్దు చేసుకోవడానికి ఈ నెల 18 వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

తుదివిడత కౌన్సెలింగ్ అనంతరం.. ఈనెల 20 నుంచి స్పెషల్ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. దీని కోసం.. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాలని.. దీనికి సంబంధించి 24న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. దీనికి హాజరయ్యే అభ్యర్థులు 24 నుంచి 26 వరకు వెబ్‌సైట్‌ ద్వారా ట్యూషన్‌ ఫీజు చెల్లించాలన్నారు. 24 నుంచి 26 వరకు అడ్మిషన్ పొందిన వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

Also Read:

Hyderabad: ట్రయిల్ రూమ్‌లో యువతి దుస్తులు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌తో రికార్డింగ్.. ఇద్దరు విద్యార్థుల అరెస్ట్‌..

Viral Video: ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కొరడా దెబ్బలు.. ఎందుకలా చేశారంటే..