DOST Application: నేటి నుంచి దోస్త్ స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి వివరాలు..
DOST Application: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రక్రియను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్..
DOST Application: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రక్రియను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి (శనిరవారం) ప్రారంభమవుతోంది. అభ్యర్థులు ఈ నెల 20 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయి తర్వాత 24న సీట్లు కేటాయించనున్నారు. ఇక ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
ఇదిలా ఉంటే గతంలో సీటు కేటాయించినప్పటికీ కళాశాలలో చేరనివారు రూ. 400 చెల్లించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సూచించారు. స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులకు ఈనెల 24న సీట్లను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 26 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా కోర్సు లేదా మీడియం మారాలనుకునే వారికి కూడా అవకాశం కలిపించారు. ఈ మేరకు నవంబర్ 27 నుంచి 29 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కాలేజీల్లో ఇంకా 2,19,693 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Also Read: Crime News: వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. తొలిసారిగా కోకైన్, చరస్ మత్తు పధార్థాలు సీజ్!