IND VS SCO: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. ఆ ‘స్పెషల్ రికార్డు’లో నిలిచిన భారత ఏకైక బౌలర్‌

Jasprit Bumrah: స్కాట్లాండ్‌పై జస్ప్రీత్ బుమ్రా కేవలం 10 పరుగులకే 2 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

IND VS SCO: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. ఆ 'స్పెషల్ రికార్డు'లో నిలిచిన భారత ఏకైక బౌలర్‌
Jasprit Bumrah
Follow us
Venkata Chari

|

Updated on: Nov 06, 2021 | 7:28 AM

T20 World Cup 2021, IND vs SCO: టీ20 ప్రపంచకప్ 2021లో శుక్రవారం నాడు టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా బౌలర్లు స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించారు. స్కాట్లాండ్ జట్టును భారత్ కేవలం 85 పరుగులకే కట్టడి చేసింది. భారత్ తరఫున షమీ, జడేజా చెకో 3 వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా కేవలం 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఎకానమీ రేటు ఓవర్‌కు 2.7 పరుగులు మాత్రమే ఉండడం విశేషం. ఈ ప్రదర్శనతో బుమ్రా ఓ భారీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు.

జస్ప్రీత్ బుమ్రా స్కాట్లాండ్‌పై మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు. దీంతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20లో బుమ్రాకు 8 మెయిడిన్ ఓవర్లు ఉండగా, నువాన్ కులశేఖర, ముస్తిఫిజుర్ రెహమాన్ చెరో 6 మెయిడిన్లతో సమానంగా నిలిచారు.

భారత నంబర్ వన్ ‘వికెట్ల వీరుడు’.. జస్ప్రీత్ బుమ్రా టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 63 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్‌ను బుమ్రా అధిగమించాడు. బుమ్రా ప్రస్తుతం 64 టీ20 అంతర్జాతీయ వికెట్లతో నంబర్ వన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రాతో పాటు షమీ కూడా మెయిడిన్ ఓవర్ బౌల్ చేశాడు. ఇద్దరూ ఒకే ఓవర్‌లో వికెట్లు తీశారు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు నుంచి ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. 2016లో జరిగిన ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార‌లు ఒకే ఓవర్లో వికెట్లు తీశారు.

జడేజా అద్భుత ప్రదర్శన.. రవీంద్ర జడేజా స్కాట్లాండ్‌పై కేవలం 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇది అతని టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌ను కేవలం 39 బంతుల్లోనే టీమిండియా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ టీమ్ ఇండియాకు 86 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఓపెనింగ్‌ జోడీ కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. రోహిత్ కూడా 16 బంతుల్లో 30 పరుగులు చేయడంతో భారత్ లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే సాధించింది.

నికర రన్‌రేట్‌లో నంబర్ వన్.. స్కాట్లాండ్‌పై భారీ విజయంతో భారత్ నెట్ రన్ రేట్ గ్రూప్ 2లో అత్యుత్తమంగా నిలిచింది. భారత్ 4 మ్యాచ్‌లలో 2 విజయాలతో 4 పాయింట్లను కలిగి ఉంది. నెట్ రన్ రేట్ (+1.619)లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా నమీబియాపై భారీ విజయం సాధించాలి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్‌ మ్యాచులో ఆఫ్ఘన్ గెలవాలని ఆశించాలి. అప్పుడే సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.

Also Read: T20 World Cup 2021: స్కాట్లాండ్‌పై సూపర్ విక్టరీ.. టీమిండియా ముందు తలొంచిన 5 ఏళ్ల రికార్డులు..!

Viral Photos: స్కాట్లాండ్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోహ్లీసేన.. వైరలవుతోన్న డ్రెస్సింగ్ రూమ్ ఫొటోలు

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ