- Telugu News Sports News Cricket news T20 World Cup 2021, IND vs SCO: Team India registers it's biggest T20i win against scotland and creates biggest victory in t20i
T20 World Cup 2021: స్కాట్లాండ్‌పై సూపర్ విక్టరీ.. టీమిండియా ముందు తలొంచిన 5 ఏళ్ల రికార్డులు..!
ఈ విజయంతో భారత్‌కు రెండు పాయింట్లు దక్కడమే కాకుండా నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా పెంచుకుంది. దీంతో సెమీఫైనల్‌కు చేరే రేసు ఉత్కంఠగా మారింది.
Updated on: Nov 06, 2021 | 6:59 AM

టీ20 ప్రపంచకప్ 2021లో తమ నాలుగో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్కాట్లాండ్‌ను దారుణంగా ఓడించింది. తొలుత స్కాట్లాండ్‌ను 85 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగి కేవలం 6.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విధంగా, భారత్ 81 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇది ఈ ఫార్మాట్‌లో మిగిలి ఉన్న బంతుల పరంగా భారత్‌కు అతిపెద్ద విజయంగా నిలిచింది.

అంతకుముందు 2016 ఆసియా కప్‌లో యూఏఈపై భారత్ అతిపెద్ద విజయం సాధించింది. యూఏఈని 81/9 స్కోరుకు పరిమితం చేసిన భారత్ 10.1 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 28 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేయగా, యువరాజ్ సింగ్ కూడా 14 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

2016లో టీమ్ ఇండియా కూడా జింబాబ్వేపై సులువుగా గెలిచింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు అంతకుముందు జింబాబ్వేను కేవలం 99 పరుగులకే ఆలౌట్ చేసి, ఆ తర్వాత ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్ 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.

2016లో 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. భారత్‌పై శ్రీలంక లాంటి బలమైన జట్టు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీలంక ఇన్నింగ్స్ కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమ్ ఇండియా 13.5 ఓవర్లలో 37 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధిచింది.

అంతకుముందు 2010లో వెస్టిండీస్‌లోని గ్రాస్ ఐలెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ఘోరంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 8 వికెట్ల నష్టానికి 115 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఈ లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే భారత్ 30 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.





























