AUS vs WI, T20 World Cup 2021: ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ టిక్కెట్‌లో అదిరిపోయే ట్విస్ట్.. అదేంటంటే?

అబుదాబి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సెమీఫైనల్ టికెట్‌పై కన్నేసింది. అదే సమయంలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్ చివరి గేమ్‌ను విజయంతో ముగించాలని ఎదురుచూస్తోంది.

AUS vs WI, T20 World Cup 2021: ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ టిక్కెట్‌లో అదిరిపోయే ట్విస్ట్.. అదేంటంటే?
Aus Vs Wi, T20 World Cup 2021
Follow us
Venkata Chari

|

Updated on: Nov 06, 2021 | 7:32 AM

T20 World Cup 2021, AUS vs WI: టీ20 ప్రపంచ కప్ 2021 గ్రూప్ 1 నుంచి రెండు సెమీ-ఫైనలిస్ట్ జట్ల పేర్లు నేడు తెలిసిపోనున్నాయి. ఈరోజు తొలి పోటీ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరగనుంది. అబుదాబి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సెమీఫైనల్ టికెట్‌పై కన్నేసింది. అదే సమయంలో, టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన వెస్టిండీస్ చివరి గేమ్‌లో విజయం సాధించాలని ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియా గెలిచినా సెమీఫైనల్‌కు చేరే కథనంలో ట్విస్ట్‌ ఉంటుంది. నిజానికి, దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ఈరోజు రెండో మ్యాచ్‌ని నిర్ణయించే వరకు సెమీ-ఫైనల్‌కు చేరుకునే పరిస్థితి స్పష్టంగా లేకపోవడం గమనార్హం.

గ్రూప్ దశలో ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ జట్లు నేడు చివరి మ్యాచ్ ఆడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 3 గెలిచి 1 ఓడిపోయింది. కాగా, ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్ కథ దీనికి విరుద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 1 గెలిచి 3 ఓడింది. కానీ, ఈ రోజు అది తన రెండవ విజయాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఇది స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత, డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కాబోతున్నాడు. శ్రీలంకతో మ్యాచ్ తర్వాత ప్రకటించిన సంగతి తెలిసిందే.

టీ20ల్లో వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా.. టీ20 ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య ఇది ​​17వ మ్యాచ్‌. ఇంతకు ముందు ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 6 సార్లు విజయం సాధించింది. వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది. అబుదాబిలో ఇరు జట్ల మధ్య ఇదే తొలి ఎన్‌కౌంటర్‌. గత 5 మ్యాచ్‌ల గురించి మాట్లాడితే, వెస్టిండీస్ 4-1తో ఆధిపత్యంలో నిలిచింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు నేడు ఆరోసారి తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ మరోసారి భారీ స్కోరు సాధించింది. కరీబియన్ జట్టు 3 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. వెస్టిండీస్ ఈరోజు తమ సత్తాకు తగ్గట్టుగా ఆడితే ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లడంతోపాటు విజయంతో డ్వేన్ బ్రావోకు వీడ్కోలు పలకవచ్చని స్పష్టమవుతోంది.

వెస్టిండీస్‌లో మార్పు ఆస్ట్రేలియాకు భారీ నష్టమేనా.. రెండు జట్ల విషయానికొస్తే, ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులకు చోటివ్వబోదు. అదే సమయంలో, వెస్టిండీస్ జట్టులో రవి రాంపాల్ స్థానంలో హేడెన్ వాల్ష్ జూనియర్‌కు స్థానం కల్పించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ హేడెన్ వాల్ష్‌కు ఇష్టమైన బాధితుడు కాబట్టి ఈ మార్పు కూడా జరుగుతుంది. ఇద్దరూ టీ20లో 3 సార్లు ముఖాముఖిగా తలపడ్డారు. ప్రతిసారీ వాల్ష్ ఫించ్‌ను వేటాడాడు.

Also Read: IND VS SCO: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. ఆ ‘స్పెషల్ రికార్డు’లో నిలిచిన భారత ఏకైక బౌలర్‌

T20 World Cup 2021: స్కాట్లాండ్‌పై సూపర్ విక్టరీ.. టీమిండియా ముందు తలొంచిన 5 ఏళ్ల రికార్డులు..!