Hyderabad: ట్రయిల్ రూమ్‌లో యువతి దుస్తులు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌తో రికార్డింగ్.. ఇద్దరు విద్యార్థుల అరెస్ట్..
Hyderabad Crime News: దుస్తులు తీసుకునేందుకు ఓ యువతి కుటుంబసభ్యులతో వస్త్ర దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన యువకులు.. యువతి దుస్తులు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌తో
Hyderabad Crime News: దుస్తులు తీసుకునేందుకు ఓ యువతి కుటుంబసభ్యులతో వస్త్ర దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన యువకులు.. యువతి దుస్తులు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36/10లో అల్కజార్ మాల్‌లోని హెచ్‌అండ్‌ఎం స్టోర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అంతకుముందే.. దుస్తులు కొనుగోలు చేయడానికి వచ్చిన సీఏ విద్యార్థి కిరీట్ అసత్, ఇంటర్ చదువుతున్న గౌరవ్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో యువతి దుస్తులను సరిచూసుకునేందుకు ట్రయల్ రూంలోకి వెళ్లింది. అయితే.. ఆమె ట్రయిల్ రూమ్‌కి వెళ్లడాన్ని గమనించిన ఇద్దరు యువకులు.. పక్కనే ఉన్న ట్రయిల్ రూమ్‌కి వెళ్లారు. రూమ్స్ మధ్య రూఫ్ ఓపెన్‌గా ఉండటాన్ని గమనించిన గౌరవ్.. కిరీట్ ఆ యువతి వీడియోను రికార్డ్ చేయాలని ప్లాన్ చేశారు.
రెండు గదుల మధ్య అసంపూర్తిగా ఉన్న చెక్కల మధ్యలో సెల్‌ఫోన్ ఉంచి వీడియో చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గమనించిన యువతి కేకలు వేసింది. వెంటనే అక్కడికి చేరుకు షాప్ సిబ్బంది ఇద్దర్నీ పట్టుకుని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువతి ఆగ్రహంతో వారికి దేహశుద్ధి చేయడంతోపాటు, ఫోన్‌లోని వీడియోలను తొలగించింది. సమచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు చేయడానికి యువతి నిరాకరించడంతో.. సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అయితే.. కస్టమర్లకు రక్షణ కల్పించడంలో విఫలమైన స్టోర్ మేనేజర్ అమన్‌సూరిపైనా కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Also Read: