Crime News: నిందితుడిని పట్టిచ్చిన చెప్పు.. యువకుడి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Murder Case: ఓ యువకుడు ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారు దాదాపు 15 రోజుల నుంచి కేసును ఛేధించేందుకు తీవ్రంగా

Crime News: నిందితుడిని పట్టిచ్చిన చెప్పు.. యువకుడి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2021 | 10:51 AM

Murder Case: ఓ యువకుడు ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారు దాదాపు 15 రోజుల నుంచి కేసును ఛేధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానిత ప్రదేశంలో దొరికిన ఓ చెప్పు నిందితుడిని పట్టించింది. వివాహేతర సంబంధమే.. ఓ వ్యక్తి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఈ షాకింగ్‌ సంఘటన మహారాష్ట్రలోని పూణె పట్టణంలో చోటు చేసుకుంది. యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ భర్తే.. ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బవ్ధాన్‌ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి అక్టోబర్‌ 22 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో.. అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో 15 రోజులపాటు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో తప్పిపోయిన యువకుడికి సంబంధించిన ఓ చెప్పు.. వీధిలోని ఓ ఇంటి ముందునున్న పెరెట్లో కనిపించింది. దీంతో ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించారు. తమదైన స్టైల్‌లో పోలీసులు విచారించడంతో.. షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తప్పిపోయిన యువకుడిని సదరు ఇంటి యమజానే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తికి తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని.. అందుకే అతడ్ని చంపినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. అక్టోబర్‌ 21న మరణించిన వ్యక్తి మొబైల్‌ నంబర్‌ నుంచి తన భార్యకు రెండు మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయని.. అదేరోజు రాత్రి అతను తన ఇంటికి వచ్చి తన భార్యను కలిసినట్లు వెల్లడించాడు. దీంతో అతడిని.. మరో ఇద్దరి సాయంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తితో దాడి చేసి చంపి.. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టినట్టు నిందితులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Hyderabad: ట్రయిల్ రూమ్‌లో యువతి దుస్తులు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌తో రికార్డింగ్.. ఇద్దరు విద్యార్థుల అరెస్ట్‌..

Watch Video: తిరుమల బైపాస్‌లో జనంపైకి దూసుకెళ్లిన కారు.. కొనుగోలు చేసి తీసుకొస్తుండగా.. వీడియో